Phone Tapping Case: చై సామ్ విడాకుల‌కు ఇదే కార‌ణ‌మా?

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్. భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు మాజీ ముఖ్యమంత్రి KCR.. అప్ప‌టి ప్ర‌తిప‌క్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు, బ‌డా వ్యాపార‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాప్ చేసి డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే న‌లుగురు పోలీస్ అధికారుల‌ను అదుపులోకి తీసుకుని తెలంగాణ పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఫోన్ ట్యాప్ చేసేందుకు KCR.. ఇజ్రాయెల్ నుంచి ప‌రికరాన్ని తెప్పించిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే.. ఒక‌ప్పుడు టాలీవుడ్ ప‌వ‌ర్ క‌పుల్ అయిన నాగ‌చైత‌న్య‌ (Naga Chaitanya), స‌మంత‌లు (Samantha) విడిపోవ‌డానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కార‌ణమ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని ప‌లు యూట్యూబ‌ర్లు కూడా ప‌రోక్షంగా వెల్ల‌డిస్తుండ‌డంతో చ‌ర్చ‌కు దారితీసింది. ఓ బ‌డా నేత టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోయిన్ ఫోన్‌ను ట్యాప్ చేయ‌డం వ‌ల్లే ఆమె త‌న భ‌ర్త‌తో విడిపోవాల్సి వ‌చ్చింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. దాంతో అంతా స‌మంత‌, నాగ‌చైతన్య‌లే అయివుంటార‌ని భావిస్తున్నారు.