Niharika Divorce: నాగబాబే కారణమా?
Hyderabad: నిహారిక కొణిదెల చైతన్య విడాకులకు (niharika divorce) నిహారిక తండ్రి నాగబాబే (naga babu) కారణమా? మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఇదే చర్చ నడుస్తోందట. నిహారికను నాగబాబు చాలా గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి అడిగినవన్నీ ఇచ్చేవారు. నాన్న సపోర్ట్‌తోనే నిహారిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క హిట్ లేకపోయినా ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. ఇంత వరకు నిహారిక జీవితం బాగానే ఉంది. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి అత్తింటికి వెళ్లాక ఎలా సర్దుమణిగి కాపురం చేసుకోవాలి అన్న విషయాలు నిహారికకు నేర్పలేకపోయాను అని నాగబాబు తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చైతన్య ఫ్యామిలీ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌కి చెందినది కాదు. చైతన్య తండ్రి గుంటూరు ఐజీ. సో.. తమకు కాబోయే కోడలు ఎలా ఉండాలి అన్న విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. పెళ్లయ్యాక కూడా నిహారిక సినిమాలు చేస్తానంటే అత్తింటివారు ఒప్పుకోలేదని అక్కడి నుంచే అసలు సమస్య మొదలైందని తెలుస్తోంది. ఇవి కాకుండా నిహారిక, చైతన్యకు ఏమైనా పర్సనల్ సమస్యలు ఉంటే వారు విడిపోవడమే కరెక్ట్. కానీ కేవలం సినిమాల్లో నటించవద్దు అని చెప్పినందుకు గొడవలు వచ్చి విడిపోయి ఉంటే మాత్రం విడాకులు తీసుకుని పెద్ద తప్పు చేసారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నిహారికకు సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. అఫ్‌కోర్స్ అది ఆమె ఇష్టం. కానీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయివుంటే అప్పుడు నిహారిక యాక్టింగ్ కంటిన్యూ చేసినా అర్థం ఉండేది. ఏదేమైనప్పటికీ తన కూతురిని బాగా గారాబం చేసి పెంచడం వల్లే తన వైవాహిక జీవితం ఇలా అయిపోయిందని నాగబాబు బాధపడుతున్నారట.