Kalyan Ram: పన్ను ఎగవేతదారుడిగా కళ్యాణ్ రామ్ పేరును చేర్చిన కాగ్
Kalyan Ram: నటుడు కళ్యాణ్ రామ్ పన్ను ఎగవేతదారుడిగా కాగ్ రిపోర్ట్ పేర్కొంది. పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో ఆలస్యం చేయగా.. దానికి సంబంధించిన జరిమానాను ఆయన కట్టలేదని కాగ్ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ను తెలంగాణ అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టారు. జులై 2017 నుంచి అక్టోబర్ 2017 మధ్యలో పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉండగా.. దానిని డిసెంబర్‌లో ఫైల్ చేసారని.. ఆ తర్వాత ఫిబ్రవరి 2018 నుంచి మార్చి 2018 మధ్యలో దాఖలు చేయాల్సిన రిటర్నులను ఏప్రిల్ 2018 నుంచి జులై 2018 మధ్యలో చేసారని కాగ్ రిపోర్ట్‌లో వెల్లడించింది. కట్టాల్సిన పన్ను ఆలస్యంగా కట్టడమే కాకుండా.. దానికి కట్టాల్సిన రూ.11.53 ఆలస్య రుసుంను ఎగవేసారని తెలిపింది.