Genelia తల్లికాబోతోందా?
మన హ హ హాసిని జెనీలియా (genelia) తల్లికాబోతోందా? ఇటీవల తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో (ritesh deshmukh) కలిసి ఓ ఈవెంట్‌లో మెరిసిన జెనీలియాను చూసిన వారికి ఇదే సందేహం వస్తుంది. జెనీలియా పొట్ట కాస్త ఎత్తుగా ఉంది. పైగా పొట్టపై చెయ్యి పెట్టి కవర్ చేస్తున్నట్లుగా ఫోటోగ్రాఫర్లకు పోజులివ్వడంతో ఆమె నిజంగానే మూడోసారి తల్లికాబోతున్నారని అనుకుంటున్నారు. 2012లో తన తొలి సినిమా హీరో అయిన రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది జెనీలియా. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.