Miller’s Girl: 21 ఏళ్ల హీరోయిన్‌తో 52 ఏళ్ల నటుడి సెక్స్ సీన్..ఇదేం దరిద్రం?
Miller’s Girl: హాలీవుడ్ చిత్రం మిల్లర్స్ గర్ల్ వివాదాస్పదంగా మారింది. జెన్నా ఓర్టెగా (Jenna Ortega), మార్టిన్ ఫ్రీమ్యాన్ (Martin Freeman) కీలక పాత్రల్లో నటించిన సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సెక్స్ సీన్ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం వారి వయసు. హీరోయిన్ జెన్నా ఓర్టెగా వయసు 21 కాగా.. మార్టిన్ ఫ్రీమ్యాన్ వయసు 52. తండ్రి, కూతురి వయసున్న వీరిద్దరి మధ్య సెక్స్ సీన్ ఎలా పెడతారు అని నెటిజన్లు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.
ఇది బ్లాక్ కామెడీ డ్రామాగా థియేటర్లలో రిలీజ్ అయింది. మరో దరిద్రమైన అంశం ఏంటంటే.. ఇందులో హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్‌లో నటించగా.. మార్టిన్ ప్రొఫెసర్ పాత్రను పోషించారు. స్టూడెంట్ ప్రొఫెసర్‌కు ఎట్రాక్ట్ అయ్యి కాలేజీలోనే అతని సెక్స్ చేయడం ఏంటి? ఇలాంటి సన్నివేశాన్ని ఎలా పెడతారు? ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలంటే ఎలాంటి హద్దులు లేకుండా మితిమీరిన శృంగారభరిత సన్నివేశాలను చూపించేవారు. కానీ ఇప్పుడు విద్యార్ధులు, టీచర్ల మధ్య అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అలాంటి సమయంలో ఇలా విద్యార్ధికి ప్రొఫెసర్‌కి మధ్య రొమాన్స్, ప్రేమ వంటి అంశాలను ఎలా చూపిస్తారు అంటూ ఆడియన్స్ మండిపడుతున్నారు.
అసలు మిల్లర్స్ గర్ల్ కథేంటి?
జెన్నా ఓర్టెగా ట్యాలెంటెడ్ స్టూడెంట్, రైటర్. తన ప్రొఫెసర్ అయిన మార్టిన్ ఫ్రీమ్యాన్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అది ప్రేమో ఆకర్షణో తెలీదు కానీ ఇద్దరూ దగ్గరవుతారు.
నటీనటులన్నాక దర్శకులు చెప్పిందే చేస్తారు అంటుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటివి చెప్తే జనాలు ముఖం మీద ఊస్తారు. ఇలాంటి దరిద్రమైన సన్నివేశాల్లో నటించాలి అని చెప్పిన దర్శకులకు ఆ సీన్ మార్చి కాస్త అర్థవంతంగా చూపించే సామర్ధ్యం ఉండదా? సెక్స్, రొమాన్స్, కిస్సెస్ లేని సినిమాలు లేవు. పైగా ఇప్పుడు ఇంకా మితిమీరిపోతున్నాయి. సెన్సార్ బోర్డు కూడా మావల్ల కాదు అని చేతులెత్తేస్తోంది.
పైగా ఇటీవల అమెరికాలోని రెండు మూడు పాఠశాలల్లో టీచర్లు విద్యార్ధులతో సెక్స్ చేస్తూ దొరికిపోయిన కేసులు కూడా బయటికి వచ్చాయి. ఇటీవల ఓ కన్నతల్లి తన బిడ్డ స్కూల్‌లో ఎలా చదువుతున్నాడో ఎలా ఉంటున్నాడో తెలుసుకుందామని వెళ్తే.. ఆంటీ మీ అబ్బాయి టీచర్‌తో పార్కింగ్ స్లాట్‌లో ఉన్న కారులో సెక్స్ చేస్తున్నారు అని హేళనగా మాట్లాడారంట. అది నిజమో కాదో తెలుసుకుందామని వెళ్తే ఓ తల్లి చూడకూడని దృశ్యాన్ని చూసి ఆమె గుండె పగిలిపోయింది. ఇంతగా దిగజారిపోయిన తన కుమారుడిని పిలిచి తిట్టినా వాడు మాట వినడు అని అర్థంచేసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పిల్లలు తప్పు చేస్తే సరైన మార్గంలో పెట్టాల్సిందిపోయి విద్యార్ధితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న టీచర్‌ను అరెస్ట్ చేయించింది.
తన కుమారుడిని మాత్రం కౌన్సిలింగ్‌కు పంపించాలని కోరింది. ఇలాంటివి అమెరికా వంటి దేశాల్లో కామన్ అనుకుంటారు కానీ వీటిని అలా చూసి చూడనట్లు వదిలేయడం ఎంత వరకు సమంజసం. ఓ రకంగా టీనేజర్లు కానీ పెద్దలు కానీ ఇలా తయారవడానికి కారణం సినిమాలు కూడా కావచ్చు. సినిమాల్లో ఇవేమీ తప్పు కాదు అన్నట్లు చూపిస్తే వారు కూడా అదే ఫాలో అయిపోతారు. దర్శకులకు సినీ లిబర్టీ ఉండకూడదా అంటే కొన్ని సందర్భాల్లో ఉన్నా వాడుకోకూడదు అని వారూ అర్థంచేసుకోవాలి. ఈ రోజుల్లో కాస్త అర్థవంతంగా ఉండే సినిమాలకే జనాదరణ పెరుగుతోంది. ఇది కేవలం హాలీవుడ్‌కే కాదు మన టాలీవుడ్‌కి కూడా వర్తిస్తుంది.