Kushi: అటెన్షన్ కోసమేగా..?
సమంత (samantha) విజయ్ దేవరకొండ (vijay devarakonda) నటించిన ఖుషి (kushi) సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న సమంత ఖుషి ప్రమోషన్స్ (kushi promotions) కోసం ఒక వారం కేటాయించినట్లుంది. నిన్న ఖుషి ప్రమోషన్స్‌లో భాగంగా సామ్ విజయ్ కలిసి స్టేజ్‌పై చేసిన ఇన్‌టిమేట్ డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ లేనిది విజయ్ సామ్‌ని ఎత్తుకోవడం, దగ్గరగా తీసుకుని హగ్ చేసుకోవడం వంటి స్టంట్స్ చేసారు. ఇదంతా అటెన్షన్ కోసమేనని అందరికీ తెలిసినప్పటికీ కొందరు మాత్రం అంత ఓవర్ చేయాల్సిన అవసరం ఏముంది అని కామెంట్స్ చేస్తున్నారు.