Anna Lezhneva: రష్యా, సింగపూర్‌లో 1800 కోట్ల ప్రాపర్టీలు.. పవన్ సతీమణి గురించి ఈ విషయాలు తెలుసా?
Anna Lezhneva: ఆన్నా లెజ్నెవా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి. పవన్ ఓ తుఫాన్ అని ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ మీడియా ముందు చెప్పినప్పటి నుంచి ఆయన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. దాంతో పవన్ గురించి తెలీనివారంతా ఆయన భార్య, పిల్లల గురించి గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట.
పవన్ భార్య ఆన్నా లెజ్నెవా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
పవన్‌కు ఆన్నా మూడో భార్య. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పేరు మార్క్ శంకర్ పవనోవిచ్.
ఆన్నా 1980లో రష్యాలో జన్మించారు. ఈమె మోడలింగ్ చేస్తూ పలు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. 2011లో వచ్చిన తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో ఆన్నా, పవన్ కలిసారు. ఆ సమయంలో వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
రెండేళ్లు డేటింగ్ చేసాక 2013 సెప్టెంబర్ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పవన్ ఆన్నాను పెళ్లి చేసుకునే సమయానికే ఆమె విడాకులు తీసుకుని ఉన్నారు. తన మొదటి భర్తతో ఓ పాపను కన్నారు. పాప పేరు పోలెనా అంజనా పవనోవా. పాపను కూడా పవన్ కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు.
మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సంపాదించిన డబ్బుతో పలు హోటల్ చైన్స్ ప్రారంభించారట ఆన్నా. ఆమెకు సింగపూర్, రష్యాలో దాదాపు రూ.1800 కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు ఉన్నట్లు సమాచారం.
పవన్‌ను వివాహం చేసుకున్నాక ఆన్నా తెలుగు నేర్చుకున్నారు. కొంచెం కొంచెం ఆవిడ తెలుగులో మాట్లడగలరు. తెలుగు వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తన సంప్రదాయాన్ని కూడా మార్చుకున్నారు ఆన్నా. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనూ ఆన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.