Devara: ఇంట్రెస్టింగ్ అంశాలు..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) కొర‌టాల శివ (koratala siva) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న దేవ‌రపై (devara) భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆచార్య‌తో (acharya) డీలాప‌డిపోయిన కొర‌టాల‌కు దేవ‌ర కొత్త ఊపుని ఇస్తుంది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. నిన్న ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్న సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) లుక్ రివీల్ చేసిన‌ప్పుడే కొర‌టాల ఏదో గ‌ట్టిగా ప్లాన్ చేసాడ‌ని అర్థ‌మైపోయింది.

ఇక‌పోతే సినిమాలో మొత్తం 5 పాట‌లు ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. వాటిలో ఒక‌టి మోంటేజ్ సాంగ్ ఉంటుంద‌ట‌. అస‌లే అక్క‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ (anirudh ravichander). ఇక ఏ రేంజ్‌లో పాట‌లు, బీజీఎం ఉండ‌బోతున్నాయో మ‌న ఊహ‌కే వ‌దిలేసారు. ఈ పాట‌ల్లోనే తారక్, సైఫ్ అలీ ఖాన్ పాట కూడా ఉంటుంది. ఈ పాట‌లో మొత్తం 500 మంది ఆర్టిస్ట్‌లు ఉంటార‌ట‌. ఇక సినిమా మొత్తంలో కేవ‌లం 6 ఫైట్ సీన్స్ ఉంటాయి. అవి సినిమాకు హైలైట్ అని తెలుస్తోంది. సినిమాలో VFX సీన్స్ ఉంటాయి కానీ సినిమా మొత్తంలో VFX ఉండేది కేవ‌లం 30% మాత్ర‌మే. సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ క‌ల్లా అయిపోతుందట‌. ఎలాంటి డిలే లేకుండా సినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌నున్నారు. (devara)