Allu Arjun ని అన్‌ఫాలో చేసి.. ఆ హీరోని మాత్ర‌మే ఫాలో అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌

Allu Arjun: ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఇన్‌స్టాగ్రామ్ (instagram) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసింది. పుష్ప (pushpa) సినిమాకు గానూ బ‌న్నీకి జాతీయ అవార్డు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్ బ‌న్నీని ఫాలో అయ్యింది. ఆ స‌మ‌యంలో ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిన ఏకైక భార‌తీయ సెల‌బ్రిటీ బ‌న్నీనే. మొన్న క్రిస్మ‌స్ రోజున బ‌న్నీని అన్‌ఫాలో చేసేసింది ఇన్‌స్టాగ్రామ్‌. ఇప్పుడు ఇన్‌స్టా ఫాలో అవుతున్న ఏకైక భార‌తీయ న‌టుడు విక్కీ కౌశ‌ల్ మాత్ర‌మే. అస‌లు ఎందుకు ఇన్‌స్టా బ‌న్నీని అన్‌ఫాలో చేసిందో ఏమో..!