Deepika Padukone: నా కంపెనీలో నేను పందిని
Deepika Padukone: తన కాస్మెటిక్ కంపెనీ అయిన 82 Eలో తానే ఒక గినియా పందిని అని అంటున్నారు దీపిక పదుకొణె. ఏవైనా కాస్మెటిక్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను తయారుచేస్తున్నప్పుడు ముందు వాటిని గినియా పందులపై టెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ టెస్టింగ్‌లు చాలా మటుకు ఆగిపోయినప్పటికీ ఇంకా కొన్ని కంపెనీలు పందులను వాడి తమ ప్రొడక్టులను టెస్ట్ చేస్తున్నాయి. దీనిపై దీపిక స్పందిస్తూ.. తన కాస్మెటిక్ కంపెనీలో మాత్రం టెస్టింగ్ కోసం ఉపయోగించేది తననే అని.. ఓ రకంగా చెప్పాలంటే తన కంపెనీకి తానే గినియా పందిని అని అంటున్నారు. ఈ బ్రాండ్‌ను లాంచ్ చేయడానికి ఎంతో కష్టపడ్డామని.. దాదాపు రెండేళ్ల పాటు మహిళలు ఎదుర్కొంటున్న చర్మ సమస్యల గురించి తెలుసుకుని ప్రొడక్టులను లాంచ్ చేసామని పేర్కొన్నారు.