Ileana: నేను టాలీవుడ్‌ని వదిలేసానని అనుకున్నారు
Ileana: తాను బాలీవుడ్ సినిమాను సంతకం చేయగానే టాలీవుడ్‌ని సౌత్ సినిమాలను వదిలేసానని అనుకున్నారని అన్నారు ఇలియానా. ఇప్పుడు ఒక బిడ్డకు తల్లైన ఇలియానా.. చాలా కాలం తర్వాత దో ఔర్ దో ప్యార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే తాను టాలీవుడ్‌ని సౌత్ సినిమాలను వదిలేయలేదని.. చాలా మంది ఈ విషయంలో పొరబడ్డారని తెలిపారు.
టాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన ఇలియానాకు 2012లో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. బర్ఫీ సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇలియానా హిందీ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇక తెలుగు సినిమాలు చేయరేమో అనుకుంటున్న సమయంలో అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాతో సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే తాను బాలీవుడ్‌లోకి వెళ్లాక తెలుగు సినిమా కథలు రాలేదని.. అది కూడా ఒకందుకు మంచిదే అయ్యిందని.. తనకు ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలిసొచ్చిందని తెలిపారు.