Ileana: నా బిడ్డ బాధ‌ను భ‌రించలేక‌పోతున్నాను

గోవా బ్యూటీ ఇలియానా (ileana) ఇటీవ‌ల పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. బాబుకి కోవా ఫినిక్స్ డోలాన్ (koa phoenix dolan) అని పేరు పెట్టారు. బాబుకి రెండు నెల‌లు నిండుతున్న సంద‌ర్భంగా ఇలియానా ఓ పోస్ట్ పెట్టారు. బిడ్డ‌కు ఏదైనా బాధ క‌లిగితే దానిని త‌ట్టుకోవ‌డానికి మ‌న‌ల్ని ఏదీ సిద్ధం చేయ‌లేదు అని పోస్ట్ చేసారు. ఇలియానా పోస్ట్‌ని బ‌ట్టి చూస్తే త‌న బిడ్డ‌కు ఏదో అనారోగ్య స‌మస్య ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాంతో ఇలియానా రాత్రిళ్లు నిద్ర‌పోకుండా బిడ్డ‌ను చూసుకుంటూ కూర్చుంటున్నార‌ట‌. అయితే బాబుకి ఏం స‌మస్య ఉంది ఎందుకు బాధ‌ప‌డుతున్నాడు అనే విష‌యాన్ని మాత్రం ఆమె వెల్ల‌డించలేదు.