Ileana: సినిమాలకు గుడ్‌బై.. అమెరికాకు మకాం మార్చనున్న ఇలియానా
Ileana: ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లయ్యారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇక బాబు పుట్టడంతో ఇక మొత్తానికే యాక్టింగ్ వదిలేసి తన భక్త మైఖెల్ డొలాన్తో కలిసి అమెరికాకు మకాం మార్చనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇలియానా గర్భందాల్చిన నాలుగు వారాల తర్వాత తన ప్రియుడు మైఖెల్ని వివాహం చేసుకున్నారు. వీరికి ఆగస్ట్ 1న బాబు పుట్టాడు. ఇక తన పూర్తి జీవితాన్ని కుటుంబానికే కేటాయించాలని ఇలియానా అనుకుంటున్నారట. కుదిరితే అమెరికాలో సొంతంగా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారు కానీ మళ్లీ సినిమాలు మాత్రం చేయనని చెప్పినట్లు తెలుస్తోంది.