Ileana: 2 మెగా ఆఫ‌ర్లు వ‌దులుకుందా?

Hyderabad: గోవా బ్యూటీ ఇలియానా (ileana) రెండు సార్లు మెగా ఆఫ‌ర్లు వ‌దులుకుంద‌ట‌. ఇలియానా (ileana d cruz) స‌న్నిహిత వర్గాల స‌మాచారం ప్ర‌కారం మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టించిన వాల్తేర్ వీర‌య్య (waltair veerayya) సినిమాలో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాన్స్ ఇలియానాకే (ileana) వ‌చ్చింద‌ట‌. కానీ అప్ప‌టికే ఇలియానా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాల‌ని అనుకుంటోంద‌ట‌. అందుకే నో చెప్పిన‌ట్లు టాక్. ఆ త‌ర్వాత భోళా శంక‌ర్ (bhola shankar) కోసం కూడా త‌మ‌న్నా కంటే ముందు ఇలియానా అయితే బాగుంటుంద‌ని అనుకున్నార‌ట డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్‌. అప్ప‌టికి ఇలియానా ప్రెగ్నెంట్ అని తెలీడంతో ఆఫ‌ర్ రిజెక్ట్ చేసింద‌ట‌. దాంతో ఆ ఆఫ‌ర్లు శృతి హాస‌న్‌కి, త‌మ‌న్నాల‌కు వెళ్లాయి.

ఒక‌ప్పుడు పోకిరి, కిక్, జ‌ల్సా, జులాయి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించిన ఇలియానాతో ఇప్ప‌టికీ కొందరు సీనియ‌ర్ హీరోలు న‌టించాల‌ని కోరుకుంటున్నారు. ఇలియానా టాలీవుడ్‌లో ఏర్ప‌రుచుకున్న క్రేజ్ అలాంటిది. ఇక్క‌డ త‌న స‌త్తా ప్రూవ్ చేసుకున్నాక బాలీవుడ్‌కి వెళ్లిపోయింది ఈ గోవా బ్యూటీ. అక్క‌డ కూడా త‌న యాక్టింగ్ స్కిల్స్‌తో అద‌ర‌గొట్టింది. ఆ త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్న‌ట్లు ఆడ‌లేదు. పైగా ఇలియానా కూడా విప‌రీతంగా లావైపోయింది. జీరో ఫిగ‌ర్ అంటే టాలీవుడ్‌లో ఇలియానాకు త‌ప్ప ఎవ్వ‌రికీ లేదు. అలాంటి ఇలియానా లావైపోవ‌డంతో ఫ్యాన్స్ చూడ‌లేక‌పోయారు. ఇక మ‌రో రెండు నెల‌ల్లో ఇలియానా పండంటి బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతున్నారు. సో ఇప్పుడిప్పుడే ఇలియానా మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే లేద‌నే చెప్పాలి.