Ileana: మేలోనే వివాహం అయిపోయిందా?

Hyderabad: గోవా బ్యూటీ ఇలియానా (ileana) ఇటీవ‌ల పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే. బాబుకి కోవా ఫినిక్స్ డోలాన్ (koa phoenix dolan) అని పేరు పెట్టారు. బాబు పుట్టిన నాలుగు రోజుల త‌ర్వాత ఫ్యాన్స్‌కి ప‌రిచ‌యం చేసింది. అయితే ఇలియానా ప్రెగ్నెంట్ అయిన న్యూస్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి మీ భ‌ర్త ఎవ‌రు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అంటూ ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు కామెంట్స్ వ‌చ్చాయి. వీట‌న్నింటికీ ఇలియానా స‌మాధానం ఇవ్వ‌లేదు.

కాక‌పోతే ఎంగేజ్‌మెంట్ అయిన‌ట్లు మాత్రం త‌న ఉంగరాన్ని చూపిస్తూ ఒక ఫొటో పోస్ట్ చేసింది. ఆ త‌ర్వాత త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే ఇప్పుడు మ‌రో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఇలియానాకు (ileana) ఆల్రెడీ పెళ్లి అయిపోయింద‌ట‌. మే నెల‌లోనే 13న‌ త‌న బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసేసుకున్న‌ట్లు ఆమె స‌న్నిహితులు చెప్తున్నారు. ఇక‌పోతే.. ఇలియానా భ‌ర్త పేరు మైఖెల్. (micheal)

ileana son
ileana son