Dil Raju: దేవ‌ర రాక‌పోతే ఫ్యామిలీ స్టార్ వ‌స్తాడు..!

Dil Raju: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) న‌టిస్తున్న దేవ‌ర (devara) సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సైఫ్ అలీ ఖాన్‌కు (saif ali khan) గాయం అవ్వ‌డంతో ఆయ‌న‌కు ఇటీవ‌ల స‌ర్జ‌రీ జ‌రిగింది. దాంతో ఆయ‌న దేవ‌రలో పూర్తి చేయాల్సిన సీన్స్ లేట్ అయ్యేలా ఉన్నాయి. కాబ‌ట్టి అనుకున్న తేదీకి దేవ‌ర వ‌చ్చేలా లేదు. దాంతో ఆ రిలీజ్ డేట్‌ను తాను త‌న్నుకునిపోవాల‌ని చూస్తున్నారు నిర్మాత దిల్ రాజు (dil raju). ఆయ‌న నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఫ్యామిలీ స్టార్ (family star) షూటింగ్ ఫాస్ట్‌గా అయిపోతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (vijay devarakonda) , మృణాల్ ఠాకూర్ (mrunal thakur) ఫ్యామిలీ స్టార్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను దేవ‌ర రిలీజ్ అవ్వాల్సిన తేదీన రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు.