Upasana: బీమా డబ్బుతోనే బిడ్డకు జన్మనిస్తా
Hyderabad: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), ఉపాసన(upasana) దంపతులు త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పెళ్లైన దాదాపు పదేళ్ల తర్వాత ఉపాసన(upasana) మొదటిసారి తల్లికాబోతున్నారు. దాంతో వారి ఇంట ఆనందాలకు అవధుల్లేవు. అయితే తన డెలివరీ గురించి ఉపాసన ఓ సందర్భంలో ఇంట్రెస్టింగ్ వివరాలు వెల్లడించారు.
“మా బిడ్డకు కావాల్సిన ఫ్రీడం ఉంటుంది. కాకపోతే కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందే. ఎందుకంటే సెలబ్రిటీ లైఫ్ అనేది ఎంతో బాధ్యతతో ఉంటుంది. నాకు ఇంట్లో పనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ నా బిడ్డను నేనే చూసుకోవాలని అనుకుంటున్నాను. దీని ద్వారా నేను నా కెరీర్‌ని, మదర్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. డెలివరీ అయ్యాక కూడా కెరీర్‌పై కాన్సెంట్రేట్ చేయొచ్చు అనే విషయాన్ని నేను ఇతర తల్లులకి చెప్పాలనుకుంటున్నాను. మెటర్నిటీ సెలవులు అనేవి ఆరు నెలలు మాత్రమే ఇస్తున్నారు. మూడు లేదా తొమ్మిది నెలలు ఎందుకు ఇవ్వకూడదు? తల్లికాబోతున్న వారికే ఎన్ని నెలలు కావాలో నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలి. అపోలో ఆర్గనైజేషన్‌లో నాకున్న బీమా ద్వారానే నా బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నాను” అని తెలిపారు ఉపాసన.