చివరి శ్వాస వరకు సల్మాన్‌తోనే ఉంటా
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ప్రాణ హాని ఉన్న విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ పేరుంది. 30 ఏళ్ల క్రితం సల్మాన్ రాజస్థాన్ అడవుల్లో బిష్ణోయ్ వర్గానికి ఎంతో పవిత్రమైన బ్లాక్ బక్ జింకను వేటాడి చంపాడు. ఈ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడినప్పటికీ బెయిల్‌పై తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ వర్గం సల్మాన్‌ను ఎప్పుడెప్పుడు చంపుదామా అని కాచుకుని కూర్చుంది. సల్మాన్‌కి భారీ సెక్యూరిటీ ఉంటుండంతో అతనికి అత్యంత సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ఇటీవల దారుణంగా కాల్చి చంపేసారు.
దాంతో సల్మాన్ సెక్యూరిటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 25 ఏళ్లుగా సల్మాన్‌కు బాడీగార్డుగా పనిచేస్తున్న షేరా సెక్యూరిటీ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. తన ప్రాణం పోయేంత వరకు సల్మాన్ ఖాన్‌తోనే ఉంటానని అన్నారు. సల్మాన్‌కి మాత్రమే తాను బాడీగార్డునని.. అతనికి సెక్యూరిటీ వేరే వాళ్లు చూసుకుంటారని తెలిపారు. అభిమానుల మధ్య సల్మాన్‌ను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుందని.. అయితే వారితో కఠినంగా వ్యవహరించకూడదని సల్మాన్ తనకు చెప్పారని అన్నారు.