Varun Tej: బాబాయ్ కంటే ముందు OG క‌థ నేను విన్నా

i heard og story before babai says varun tej

Varun Tej: యువ ద‌ర్శ‌కుడు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ OG సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. OG సినిమా న‌టీనటులు, ఈ సినిమా టీజ‌ర్ అన్నీ హైప్ పెంచేలా ఉన్నాయి. అయితే.. ఈ సినిమా గురించి వ‌రుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించాడు. మ‌ట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ.. బాబాయ్ కంటే ముందు ఓజీ సినిమా క‌థ తానే విన్న‌ట్లు తెలిపాడు. ఓజీ సినిమా కోసం అభిమానులు ఎంత కాలం ఎదురుచూస్తే సినిమా అంత బాగుంటుంద‌ని అన్నాడు. రాజ‌కీయ ప‌నుల కార‌ణంగా ప‌వ‌న్ బిజీగా ఉండ‌టంతో షూటింగ్‌కి బ్రేక్ ప‌డింద‌ని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వెయిట్ చేసి మంచి ప‌ని చేసాం అనిపించేలా సినిమా ఉంటుందంటూ మ‌రింత హైప్ పెంచేసాడు వ‌రుణ్‌.