Nani: అందుకే రాజ‌మౌళి సర్‌కి విష్ చేయ‌లేదు

Hyderabad: RRR సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్(oscar) వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచ‌మంతా ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి(rajamouli)ని ఆకాశానికెత్తేసింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎన్నో చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు ప‌ర్స‌న‌ల్‌గా ఫోన్ చేసి విషెస్ చెప్పారు. కానీ నేచుర‌ల్ స్టార్ నాని(nani) మాత్రం చెప్ప‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని నాని ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. “RRRకు ఆస్కార్ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచ‌మంతా ఆయ‌న‌కు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుంద‌ని తెలుసు. నాకు తెలిసి ఆయ‌న‌కు వ‌చ్చిన మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కి ఫోన్ పేలిపోయి ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మ‌ళ్లీ నేను కూడా చేసి అన‌వ‌స‌రంగా డిస్ట‌ర్బ్ చేయ‌డం ఎందుకు అనిపించింది. అందుకే ట్వీట్ చేసాను. ఇందుకు రాజ‌మౌళి కూడా స్పందించారు. అంతేకాదు.. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రాజ‌మౌళి, ర‌మ గారు ఫ‌స్ట్ డే మార్నింగ్ షో చూసి నాకు ఫోన్ చేస్తారు” అని తెలిపారు నాని.

నాని, జ‌క్క‌న్న కాంబినేష‌న్‌లో ఈగ సినిమా వ‌చ్చి ప్యాన్ ఇండియా లెవ‌ల్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో తీయ‌బోయే అడ్వెంచ‌ర‌స్ సినిమాలో నానిని కీల్ రోల్‌లో న‌టించాల‌ని రాజ‌మౌళి అడిగార‌ట‌.