Mrunal Thakur: ఇంకెంత కాలం సెక్స్ సీన్లకు నో చెప్పాలి?
Mrunal Thakur: ఇంకెంత కాలం సెక్స్ సీన్లకు, గ్లామర్ రోల్స్‌కి నో చెప్పాలి అని అంటున్నారు మృణాల్ ఠాకూర్. హిందీ సీరియల్స్‌లో నటిగా రాణించి.. ఆ తర్వాత మెల్లిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మృణాల్. కానీ మృణాల్‌కు జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా సీతారామం. ఈ సినిమా తర్వాత మృణాల్‌కు ఆఫర్లు తన్నుకుంటూ వచ్చాయి. ఆ వెంటనే హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించారు. ఇంకా మృణాల్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
అయితే తాను సినిమాల్లోకి వెళ్తా అని చెప్పినప్పుడు అందరి తల్లిదండ్రుల్లాగే తన అమ్మానాన్నలు కూడా కండీషన్లు పెట్టారని తెలిపారు. లిప్ కిస్, రొమాంటిక్, సెక్స్ సీన్లు, విప్పి చూపించడాలు వంటివి అస్సలు చేయొద్దు అని చెప్పారట. ఈ కండీషన్ల వల్ల చాలా సినిమాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఎప్పుడైతే లిప్ కిస్కి ఓకే చెప్పిందో అప్పటి నుంచి అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయని తెలిపారు.
“” ఇంకెంత కాలం సెక్స్ సన్నివేశాలకు నో చెప్పాలి? సినిమాలో పద్ధతిగా కనిపించేది కేవలం నటన అయినప్పుడు సెక్స్ సన్నివేశాల్లో నటించడం కూడా నటనే అవుతుంది కదా? అందుకే అన్ని సన్నివేశాలకు ఇక ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను “” అని తెలిపారు.