Sheik Jani: జానీ మాస్ట‌ర్ నాకంటే పెద్ద ఆట‌గాడు ఇరికించిన హైప‌ర్ ఆది

Sheik Jani: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై ఓ అమ్మాయి అత్యాచార కేసు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. దాంతో జ‌న‌సేన నేత‌గా ఉన్న జానీ మాస్ట‌ర్‌ను పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంచుతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది జానీ మాస్టర్‌పై చేసిన కామెంట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఢీ షోకి జానీ మాస్ట‌ర్ జ‌డ్జిగా చేస్తున్న స‌మ‌యంలో హైప‌ర్ ఆది ఓ కామెంట్ చేసారు. జానీ మాస్ట‌ర్ నా కంటే పెద్ద బ్యాట్స్‌మెన్ అంటూ ఆయ‌న వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జానీ మాస్ట‌ర్ గురించి ఆదికి ముందే తెలుసన్న‌మాట అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. మ‌రోప‌క్క త‌న‌పై పెట్టిన కేసు గురించి జానీ మాస్ట‌ర్ స్పందిస్తూ.. తానే త‌ప్పు చేయ‌లేద‌ని.. ఇది డ్యాన్స‌ర్స్ యూనియ‌న్ వారు చేస్తున్న కుట్ర అని అంటున్నారు.