Humaira Himu: బంగ్లాదేశ్ న‌టి అనుమానాస్పద మృతి

ప్ర‌ముఖ బంగ్లాదేశ్ న‌టి హుమైరా హిము (37) (humaira himu) అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. రాజ‌ధాని ఢాకాలోని త‌న నివాసంలో స్పృహ త‌ప్పి ప‌డిపోయి ఉన్న హుమైరాను కుటుంబీకులు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కానీ ఆమె అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఆమె మెడ‌పై గాటు ఉండ‌డంతో అనుమానంతో డాక్ట‌ర్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. హుమైరాను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ప్పుడు అక్క‌డ‌ హుమైరా స్నేహితుడు ఉన్నారు. కానీ పోలీసులు వ‌చ్చిన‌ప్ప‌టికే అత‌ను క‌నిపించ‌కుండాపోయాడు. దాంతో అత‌నిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.