War 2: హృతిక్‌, తార‌క్‌ల సినిమా.. ఇంట్రెస్టింగ్ అప్డేట్

War 2: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్.. (Hrithik Roshan) యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (JR NTR) క‌లిసి న‌టించ‌నున్న వార్ 2 సినిమాపై ఆస‌క్తిక‌ర అప్డేట్ వ‌చ్చింది. ఈ సినిమా కోసం వీరిద్ద‌రూ దాదాపు వంద రోజుల పాటు డేట్స్ ఇచ్చార‌ట‌. ఈ వంద రోజులు హృతిక్ రోష‌న్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన హై ఆక్టేన్ యాక్ష‌న్ స‌న్నివేశాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని వార్ 2 టీం అంటోంది.

అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వార్ 2 సినిమాతో హృతిక్ రోష‌న్‌కి సిల్వ‌ర్ జూబ్లీ అవుతుంది. అందులోనూ ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ టాప్ యాక్ట‌ర్ తొలిసారి హిందీ సినిమాలో న‌టించ‌నున్నారు. దాంతో 2025లోనే వార్ 2 అతిపెద్ద చిత్రంగా నిల‌వ‌బోతోంది. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

వార్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెండో పార్ట్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. ‘వార్ 2’లో ఈ సారి హృతిక్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR NTR) ఢీ కొట్టబోతోన్నాడని చెప్పడంతే ఈ ప్రాజెక్ట్ మీద పాన్ ఇండియా వైడ్‌గా చర్చలు మొదలయ్యాయి. ఈ స్పై యూనివర్స్‌లో తారక్ భాగం కాబోతుండటంతో సౌత్‌లోనూ వార్ 2 మీద చర్చలు మొదలయ్యాయి. ఇక, ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ వార్ 2 చిత్రంపై ఫ్యాన్స్‌ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇటు సౌత్‌లో ఉన్న అభిమానులకు, నార్త్‌లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే.