BRO: పవన్ లుక్స్ వెనక ఉన్నది ఈమే..!
Hyderabad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి యాక్ట్ చేసిన బ్రో (bro) సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతోంది. ఫ్యాన్స్ పవన్ (pawan kalyan) సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ సినిమాలో చూపించేసా అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు డైరెక్టర్ సముద్రఖని (samuthirakani). రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో.. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కోసం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో పవన్ లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మరోసారి ఖుషి, జల్సా టైంలోని పవన్‌ను చూడబోతున్నామని తెగ ఖుష్ అయిపోతున్నారు.
ఇక బ్రో సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, పోస్టర్స్‌లో పవన్ వేసుకున్న డ్రెస్సెస్ క్రేజీగా ఉన్నాయి. వాటిని దగ్గరుండి డిజైన్ చేయించారు సముద్రఖని. పవన్‌ను ఇంత స్టైలిష్‌గా చూపించిన ఆ డిజైనర్ ఎవరో తెలుసా.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా (neeta lulla). ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మరీ పవన్ కోసం డ్రెస్సెస్ డిజైన్ చేసానని అంటున్నారు నీతా. కేవలం పవన్ కోసమని చొక్కాలను కట్ చేసి మరీ చేత్తో కుట్టాల్సి వచ్చిందని చెప్పారు. మై డియర్ మార్కండేయ సినిమాలో పవన్ వేసుకున్న షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ నీతానే దగ్గరుండి డిజైన్ చేయించారు. ఇవన్నీ ఫైనలైజ్ చేయడానికి రెండు రోజులు పట్టిందట. (bro)
పవన్‌కు ఎంత సింపుల్ దుస్తులు ఇచ్చినా.. ఆయన వేసుకోగానే ఆటోమేటిక్‌గా స్టైలిష్ లుక్ వచ్చేస్తుందని అంటున్నారు. ఇందులో పవన్ దేవుడి క్యారెక్టర్‌లో నటిస్తున్నారు కాబట్టి.. అయన వేసుకున్న అన్ని దుస్తులు చాలా ఆర్గానిక్‌గా డిజైన్ చేసామని నీతా (neeta lulla) చెప్పారు. ఇక బూట్ల విషయానికి వచ్చేసరికి పవన్ కోసం నీతా గుచ్చి, వర్సాచీ బ్రాండ్లకు సంబంధించి బూట్లు తెప్పించారట. అవి చూడగానే పవన్ అసలు నేను ఇలాంటివి వేసుకోను అని తెగ నవ్వారని అన్నారు. కానీ ఎప్పుడైతే పవన్ వాటిని వేసుకున్నారో సెట్స్‌లో ఉన్నవారంతా ఆయన్ని పై నుంచి కింద దాకా అలా చూస్తూ ఉండిపోయారని తన ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకున్నారు నీతా లుల్లా. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పవన్ పొలిటికల్ ప్రచారాల్లో పాల్గొనేటప్పుడు వేసుకునే వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాను కూడా నీతా లుల్లానే డిజైన్ చేసారట. పవన్ సింప్లిసిటీకి నీతా కూడా ఫిదా అయిపోయారని ఆమె మాటల్లోనే క్లియర్‌గా అర్థమైపోతోంది.