Modi బ‌యోపిక్ తీయ‌నున్న హాలీవుడ్ స్టార్ హీరో..!

Hyderabad: ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జానీ డెప్(johnny depp).. మోదీపై(modi) బయోపిక్ తీయ‌బోతున్నారు. ఆయ‌న మ‌న ప్ర‌ధాని నరేంద్ర మోదీపై(narendra modi) బ‌యోపిక్ తీయ‌డ‌మేంటి అనుకుంటున్నారా? ఈ మోదీ మ‌న ప్ర‌ధాని కాదులెండి. పెయింట‌ర్ అమేడియో మోదీగ్లియానీ(amedeo modigliani) అనే 20వ శ‌తాబ్ద‌పు పెయింట‌ర్ యొక్క బ‌యోపిక్ తీయ‌బోతున్నారు. అత‌ని ఫ్రెండ్స్ అంతా మోదీ అని పిలుస్తార‌ట. మోదీగ్లియానీ అంటే జానీ డెప్‌కు విప‌రీత‌మైన అభిమానం. ఆయ‌న వేసిన ఎన్నో పెయింటింగ్స్ డెప్ ఇంట్లో ఉన్నాయి. మోదీగ్లియానీ గొప్ప‌త‌నం ఏంటంటే.. ఆయ‌న కంట్లో క‌నుపాప క‌నిపించ‌కుండా పెయింటింగ్స్ వేస్తుంటారు. అలా వేస్తే క‌ళ్ల నుంచి జీవం ఉట్టిప‌డుతుంటుంద‌ని మోదీగ్లియానీ అంటుండేవార‌ట‌. అంత మంచి పెయింట‌ర్ అయివుండి కూడా ఆయ‌న డ‌బ్బులేని స్థితిలో త‌న పెయింటింగ్స్ అమ్ముకుని వ‌చ్చిన డ‌బ్బుతో క‌డుపు నింపుకునేవార‌ట‌. ఆయ‌న 35 ఏళ్ల‌కే టీబీ వ‌చ్చి చ‌నిపోయారు. 2018లో మోదీగ్లియానీ వేసిన రిక్లైనింగ్ న్యూడ్ అనే పెయింటింగ్ 157 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది.

Amedeo Modigliani