Vijay 68: క్రేజీ ఆఫర్​ కొట్టేసిన బేబమ్మ!

Hyderabad: ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో కుర్రకారు హృదయాలను దోచేసిన హీరోయిన్​ కృతి శెట్టి(Krithi shetty). మొదటి సినిమాతో బేబమ్మగా ఓవర్​నైట్​ స్టార్​గా మారిపోయిన కృతి వరుస అవకాశాలు అందుకుంది. కానీ కృతికి మళ్లీ ఆ రేంజ్​ హిట్​ పడలేదు. కృతి నటించిన బంగార్రాజు, శ్యామ్​సింగ రాయ్​ సినిమాలు హిట్​ అయినా కృతికి వచ్చిన గుర్తింపు అంతంత మాత్రమే. తాజాగా అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ(Custody)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితం అందించలేదు. కాగా ప్రస్తుతం కృతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్​గా మారింది.

కస్టడీ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్​ వెంకట్​ ప్రభు(Venkat Prabhu) తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే కోలీవుడ్​ స్టార్​ హీరో ఇళయ దళపతి విజయ్(Vijay)​ తన 68(Vijay 68)వ సినిమాను వెంకట్​ ప్రభుతో తీయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో కృతిని హీరోయిన్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే కృతి బంఫర్​ ఆఫర్​ కొట్టేసినట్లే అంటున్నారు నెటిజన్లు.