హీరో గోపీచంద్ పరువు తీసిన డైరెక్టర్!
Hyderabad: టాలీవుడ్ హీరో గోపీచంద్(Gopichand)–డైరెక్టర్ శ్రీవాస్(Sriwass) కాంబోలో రామబాణం(Rama Banam) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మే 5న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమాను వెరైటీగా ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యింది చిత్రబృందం. అందులో భాగంగా గోపీచంద్‌ను డేరింగ్ డైరెక్టర్ తేజ(Teja) ఇంటర్వ్యూ చేశారు.
రామబాణం టైటిల్‌ను బాలకృష్ణ సూచించారనే విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ షోకు గోపీచంద్ గెస్టుగా వెళ్లినప్పుడు.. బాలయ్య(Balakrishna) ఈ టైటిల్ సూచించారు. రామబాణం అని పెట్టుకో.. సినిమా హిట్ అవుతుంది అని చెప్పారు. దీంతో ఆ సినిమా టైటిల్‌ను రామబాణం అని ఫిక్స్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తేజతో గోపీచంద్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇక, తేజ అంటే నిర్మొహమాటంగా నిజాలు చెప్పేస్తుంటాడనే సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాల్లో గోపీచంద్‌ను అద్భుతంగా చూపించి విలన్‌కు ఓ మార్క్ సెట్ చేశాడు తేజ. అయితే అలాంటి తేజ ఫోన్ చేస్తే కూడా గోపీచంద్ ఎత్తలేదట. ఆ విషయం గురించి కూడా ప్రశ్నించాడు తేజ.
ఇక, ఈ సినిమా టైటిల్‌ను బాలయ్య ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది. ఆయన చెబితే టైటిల్ పెట్టారా? అని అడిగాడు తేజ. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీవాస్‌కు గోపీచంద్‌కు మధ్య గొడవలు వచ్చాయనే సంగతి తెలిసిందే. దాని మీద కూడా తేజ ప్రశ్నలు వేశాడు. ఇక, ఓ సినిమా కోసం గోపీచంద్‌ను అప్రోచ్ అయితే హీరోయిన్ విషయంలో తేడాలు వచ్చాయట. వేరే హీరోయిన్‌తో మాట్లాడి తీసుకొచ్చే సమయంలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట గోపీచంద్. అప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదని తేజ గుర్తు చేసుకున్నాడు. మీ నాన్న మంచితనం చూసే జయం సినిమాలో పెట్టుకున్నాను. మీ నాన్న గొప్పోడే. నువ్వేం పీకావ్ అంటూ గోపీచంద్‌ను కడిగిపారేశాడు డైరెక్టర్ తేజ.