Hema: కొంద‌రు పెద్ద‌వాళ్లు సెటిల్‌మెంట్ల‌కు పిలుస్తున్నారు

Hema reacts on banglore rave party

“” రేవ్ పార్టీ ఘ‌ట‌న అనంత‌రం నాపై మీడియాలో చాలా పుకార్లు వ‌చ్చాయి. కావాల‌నే మీడియా నాపై దుష్ప్ర‌చారం చేసింది. నేను అన్ని వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నాను. డ్రగ్స్ తీసుకోలేద‌ని తేలింది. బ‌హిరంగంగా ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికైనా సిద్ధం. నాకు కొంద‌రు మీడియా పెద్ద‌లు ఫోన్లు చేసి సెటిల్‌మెంట్ల‌కు రావాల‌ని రాజీ ప‌డాల‌ని కాల్స్ చేస్తున్నారు. నేను ఏ త‌ప్పూ చేయ‌న‌ప్పుడు నేనెందుకు రాజీ ప‌డాలి? నాకు మీడియాతో ఎలాంటి విభేదాలు లేవు. ఆరోజు నాకు వైద్య ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌క‌పోయినా డ్ర‌గ్స్ కేసులో పాజిటివ్ వ‌చ్చింద‌ని రాసేసారు. దాంతో నేను ఆవేద‌న‌తో అలా ఎలా రాస్తారు అని అడిగినందుకు హేమ పొగ‌రు, ఓవ‌రాక్ష‌న్ చేస్తోంది అని రాసేసారు. అందుకే నేను రేవంత్ రెడ్డి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాను “” అని తెలిపారు.