మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పవర్​స్టార్​ వారసుడు!

Hyderabad: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్​. కానీ.. అంతకంటే ముందే అకీరా (Akira Nandan) తెర వెనుక టెక్నీషియన్ గా ఎంట్రీ ఇచ్చేసి శెభాష్ అనిపిస్తున్నాడు. ‘రైటర్స్ బ్లాక్’ అనే షార్ట్ ఫిల్మ్ కు సంగీతం అందించాడు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ (Adivi Sesh) ట్విట్టర్ (Twitter) ద్వారా వెల్లడిస్తూ షార్ట్ ఫిల్మ్ లింక్ ను షేర్ చేశారు.

షార్ట్ ఫిల్మ్ లింక్‌ షేర్ చేసిన శేష్‌.. ‘తనకెంతో ఇష్టమైన అకీరా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు’ అని తెలిపాడు. ఒక రచయిత కథను రాయడంలో సవాళ్లను ఎలా అధిగమించాడనే కోణంలో ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. నాలుగున్నర నిముషాల నిడివితో ఇంగ్లీషులో తెరకెక్కిన లఘుచిత్రానికి కార్తికేయ యార్లగడ్డ (Karthikeya Yarlagadda) దర్శకత్వం వహించారు. ఒక రచయిత.. కథ రాయడంలో ఒత్తిడి, సవాళ్లను ఎలా అధిగమించాడనేది కథాంశం. దీనికి అకీరా నందన్ (Akira Nandan) మ్యూజిక్ డైరక్టర్ గా వ్యవహరించాడు. సన్నివేశానికి తగ్గట్టు స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ తో ఆకట్టుకున్నాడు. సంగీతంపై ఉన్న ఆసక్తితో అకీరా (Akira Nandan) పియానో నేర్చుకున్న విషయం తెలిసిందే. అకీరా అప్పుడప్పుడూ పియానో ప్లే చేస్తున్న వీడియోలను తల్లి రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇక ఆర్​ఆర్​ఆర్(RRR)​ సినిమాలో దోస్తీ పాటకు కూడా అకీరా పియానో వాయించిన సంగతి తెలిసిందే.