Ileana: నా కన్నీళ్లు తుడిచేది ఇతనే
Hyderabad: బాధలో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచేతి ఇతనే.. అంటూ ఎమోషనల్ అయ్యారు ఇలియానా (ileana). త్వరలో ఈ గోవా బ్యూటీ పండంటి బిడ్డకు జన్మినివ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన భర్త గురించి మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. కానీ నిశ్చితార్ధం అయినట్లు మాత్రం ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఫొటో ద్వారా క్లారిటీ వచ్చింది. ఇంకొన్ని నెలల్లో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇలియానా.. తన బాయ్‌ఫ్రెండ్ గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
“తల్లికావడం అనేది ఒక గొప్ప వరం. అది నాకు కలుగుతుందో లేదో అనుకునేదాన్ని. నా కడుపులో మరో ప్రాణం ఉందన్న విషయం తలుచుకున్నప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటుంది. నా కడుపుని చూసుకుంటూ త్వరలో నిన్ను కలవబోతున్నాను అని చెప్పుకుంటూ ఉంటాను. కొన్ని సార్లు ఏదో తెలీని బాధ. హోప్ లేదు అనిపిస్తుంది. అలా నా కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఏదో అపరాధ భావన. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా లేకపోతే నేను తల్లిని ఎలా అవ్వగలను. ఒక మంచి తల్లిని అవుతానో లేదో తెలీదు. నిజంగా తెలీదు. కానీ నా బిడ్డకు ఎనలేని ప్రేమను పంచుతానని మాత్రం తెలుసు. నా మీద నాకే కోపం వచ్చినప్పుడు ఈ వ్యక్తి నా పక్కనే ఉంటాడు. నన్ను స్ట్రాంగ్‌గా మారుస్తాడు. బాధలో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడుస్తాడు. లేదా నాకు ఆ సమయానికి కావాల్సిన హగ్ ఇస్తాడు. అప్పుడు నా బాధలన్నీ మాయమైపోయినట్లు అనిపిస్తుంది” అని పోస్ట్ చేసారు ఇలియానా. అయితే తన బాయ్‌ఫ్రెండ్ ఫొటోను మాత్రం షేర్ చేయలేదు.