Harish Shankar: BROకే హర్ట్ అయిపోతే ఎలా..?
Hyderabad: ఒక స్టార్ హీరోతో నార్మల్ డైరెక్టర్ సినిమా తీయడం వేరు. అదే డైరెక్టర్ హీరోకి ఫ్యాన్ అయితే? బాక్సాఫీస్‌ని ఎలా బద్దలు కొట్టాలో పక్కా ప్లానింగ్ ఉంటుంది. అదే కేటగిరీలోకి వస్తారు హరీష్ శంకర్ (harish shankar). ఆయన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్‌తో కలిసి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్నారు.
ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. బ్రో (bro) సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీని (prudhvi) పెట్టి ఏపీ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) క్యారెక్టర్‌లా చూపించారని ఆయన తెగ ఫీలైపోతున్నారు. దాంతో తానొక ఇరిగేషన్ మంత్రి అని కూడా మర్చిపోయి బ్రోకి ఇన్ని కలెక్షన్లు వచ్చాయి.. అక్కడి నుంచి అక్రమంగా ఫండింగ్ వచ్చిందంటూ ప్రెస్ మీట్లు పెట్టేసి నోటికొచ్చింది వాగేసారు. పైగా బ్రో సినిమా గురించి ఈడీతో చర్చించేందుకు దిల్లీకి కూడా వెళ్లారు.
ఒక్క సినిమాలోని క్యారెక్టర్‌కే ఇలా అయిపోతే.. ఫ్యాన్స్ పల్స్ తెలిసినోడు హరీష్ శంకర్ (harish shankar). మరి ఉస్తాద్ సినిమాలో ఇంకెన్ని పంచ్ డైలాగులు, సెటైర్లు ఉంటాయో ఆయన మన ఊహకే వదిలేసారు. పైగా పంచ్‌లు, సెటైర్లు కచ్చితంగా ఉంటాయంటూ ఖుషి సినిమాలో పవన్ సిగ్నేచర్ స్టైల్ జిఫ్‌ను పోస్ట్ చేసి మరీ చెప్పారు. మరి ఆ పంచ్‌లకి కొందరు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.