Harish Shankar: చిరు, ప‌వ‌న్, చ‌ర‌ణ్‌ల‌తో బాబు లాంటి సినిమా ప్లాన్ చేస్తున్నా

harish shankar planning pan indian film with pawan kalyan chiranjeevi and ram charan

Harish Shankar: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మెగా ఫ్యాన్స్‌కి శుభ‌వార్త చెప్పారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ఎవ‌రైనా ప్యాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో ఓ సినిమా తీయ‌లేరా అని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారి కోరిక‌ను నేను నెర‌వేరుస్తాను అని ముందుకొచ్చారు హ‌రీష్ శంక‌ర్. ఆ ముగ్గురినీ పెట్టి ప్యాన్ ఇండియ‌న్ సినిమా తీయ‌బోతున్నాన‌ని.. ఆల్రెడీ స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా స్టార్ట్ చేసేసాన‌ని చెప్పారు. కాక‌పోతే దాని గురించి ఇప్పుడే పూర్తి వివ‌రాలు వెల్ల‌డించలేన‌ని పేర్కొన్నారు.