Pawan kalyan: హరీష్ శంక‌ర్‌కు ప‌వన్ సెడ‌న్ ఫోన్‌కాల్!

Hyderabad: హరీష్ శంక‌ర్(harish shankar) డైరెక్ష‌న్‌లో.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్(ustaad bhagat singh) సినిమా చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. రోజుకో కొత్త అప్‌డేట్‌తో టీం ఫ్యాన్స్‌కి హైప్ పెంచేస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లైపోయి ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ షూట్ చేసేసార‌ట‌. అయితే ఈరోజు ఉద‌యం హరీష్‌కు ప‌వ‌న్ నుంచి స‌డెన్ ఫోన్ కాల్ వ‌చ్చింద‌ట‌. ఈ నెల 16 నుంచి ఒక 15 రోజుల పాటు షూట్ చేద్దామ‌ని చెప్పిన‌ట్లు టాక్. దాంతో హ‌రీష్ కూడా ఒకే అనేసార‌ట‌. ఇకపోతే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప‌వ‌న్ పార్ట్‌టైం రాజ‌కీయాలు చేసుకుంటూ ఫుల్ టైం సినిమాలు చేస్తున్నారు అన్న టాక్ వినిపిస్తున్న నేప‌థ్యంలో త్వ‌ర‌గా త‌న చేతిలో ఉన్న సినిమాల‌న్నీ కంప్లీట్ చేసి ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ చేయ‌నుకుంటున్నారేమో అని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే ప‌వన్ చేతిలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో పాటు ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్‌లో ఓ సినిమా ఇలా దాదాపు నాలుగైదు సినిమాల‌కు ప‌వ‌న్ ఓకే చేసారు.