Harish Shankar: వాళ్లనే బ్లాక్​ చేశా!

Hyderabad: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ నటించిన గబ్బర్​ సింగ్​(Gabbar Singh)తో స్టార్​ డైరెక్టర్ల లిస్ట్​లో చేరిపోయారు హరీష్​ శంకర్(Harish Shankar)​. అప్పటికి ప్లాప్స్​తో సతమతమవుతున్న పవన్​కి సాలిడ్​ హిట్​ ఇవ్వడంతో పవన్​ ఫ్యాన్స్​ అంతా హరీష్​ని కూడా అభిమానించడం మొదలు పెట్టారు. కానీ ఆ సినిమా వచ్చి పదేళ్లు దాటుతున్న మళ్లీ ఆ రేంజ్ హిట్​ కొట్టలేదు హరీష్​. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh) నుంచి ఇటీవలే గ్లింప్స్ రిలీజ్ చేసి మరోసారి పవన్ అభిమానుల్లో జోష్ నింపారు​.

హరీష్ శంకర్ సోషల్​ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన సినిమాలకు సంబంధించిన అప్​డేట్స్​ ట్వీట్​ చేస్తూ ఉంటారు. కానీ కొందరు హరీష్ శంకర్ ని బూతులు తిడుతూ మరీ ట్వీట్స్ చేస్తుండటంతో ఇటీవల అలాంటి వాళ్ళని హరీష్ శంకర్ బ్లాక్ చేస్తున్నాడు. ఈ విషయంలో పలువురు హరీష్ శంకర్ ని విమర్శిస్తున్నారు.

తాజాగా హరీష్ శంకర్ దీనికి క్లారిటీ ఇచ్చాడు. ఓ పవన్ అభిమాని.. ‘సారీ అన్నా.. మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాం. గ్లింప్స్ చూసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాం. ఒక్క గ్లింప్స్ తో అందరి నోళ్లు మూయించావు. నా ఆనందం మాటల్లో చెప్పలేను అన్నయ్య. మీరు బ్లాక్ చేసిన వాళ్ళందరిని దయచేసి అన్ బ్లాక్ చేయండి’ అని హరీష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. ‘మనలో మనకు గిల్టీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు. మనమంతా ఒక్కటే. సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. నేను బూతులు మాట్లాడిన వాళ్ళను మాత్రమే బ్లాక్ చేశాను. విమర్శలను తీసుకోవడానికి నేనెప్పుడూ ఇబ్బంది పడను’ అని ట్వీట్ చేశారు. దీంతో హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ గా మారింది.