Pawan ఫ్యాన్స్ కోరిక.. వరమిచ్చేసిన డైరెక్టర్
Hyderabad: దాదాపు పదేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)తో కలిసి మరో సినిమా చేస్తున్నారు దర్శకుడు హరీశ్ శంకర్(harish shankar). వీరి కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్(ustaad bhagat singh) అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో శ్రీలీల..పవన్(pawan) కలిసి ఓ మాస్ స్టెప్ వేస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇదే విషయాన్ని హరీశ్ శంకర్‌ను ట్విటర్‌లో రిక్వెస్ట్ చేసారు. అన్నా.. వీరిద్దరితో ఏదో ఒక పాటలో ఒక్క మాస్ స్టెప్ ప్లాన్ చెయ్యి అని ట్వీట్ చేసారు. ఇందుకు హరీశ్(harish shankar) ఒకే అన్నట్లు ఇమోజీస్ పెట్టారు.
దాంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. ధమాకా సినిమాలో శ్రీలీల(sreeleela) తన డ్యాన్సులతో అదరగొట్టేసింది. ఇక స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఏమీ చేయకపోయినా విజిల్స్ ఎటూ పడతాయనుకోండి. శ్రీలీల లాంటి మంచి డ్యాన్సర్ సినిమాలో ఉన్నందుకైనా పవన్‌తో స్టెప్ వేయిస్తే పీక్స్‌లో వైరల్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం. మరి హరీశ్ శంకర్ వరమిచ్చేసారంటే ఏ రేంజ్‌లో ప్లాన్ చేయబోతున్నారో వేచి చూడాలి. తమిళంలో విజయ్ నటించిన తెరి సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.