Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (hari hara veera mallu) సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు నిర్మాత ఏ.ఎం ర‌త్నం (am ratnam). ఈ సినిమాను ఎన్నికల‌కు ముందే రిలీజ్ చేస్తామ‌ని అన్నారు. ఇది చాలా పెద్ద సినిమా కాబ‌ట్టి ప‌వ‌న్ ఎన్ని రోజులు నిర్విరామంగా ప‌నిచేసినా త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి అవ్వ‌దని ఈ డిసెంబ‌ర్‌కు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంద‌ని తెలిపారు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకి సీక్వెల్ కూడా ఉంటుందని పెద్ద సినిమా కాబ‌ట్టి ప‌నులు చాలా ఉంటాయ‌ని క‌చ్చితంగా ఎన్నిక‌లకు ముందే రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి (krish jagarlamudi) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ (nidhi agarwal) హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. (hari hara veera mallu)