Hari Hara Veera Mallu: నాలుగేళ్లు అయిపోయింది.. ఉలుకు ప‌లుకు లేదు!

Hari Hara Veera Mallu: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌టించాల్సిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ముహూర్తం ఖ‌రారై నేటికి నాలుగేళ్లు పూర్త‌యింది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి (krish jagarlamudi) ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఇందులో నిధి అగ‌ర్వాల్ (nidhi agarwal) హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. ప‌వ‌న్, నిధి స్టిల్స్ కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమాను ప‌వ‌న్ ఒప్పుకున్నారో కానీ ఇంకా స‌గం షూటింగ్ కూడా పూర్తి కాలేదు.

ప‌వ‌న్ ఎన్నిక‌లతో బిజీగా ఉండ‌టంతో సినిమాకు బ్రేక్ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. పోనీ ఆయ‌న బిజీగా లేనప్పుడు ఫాస్ట్‌గా షూటింగ్ ముగించేద్దామా అంటే.. ఆయ‌న మ‌రో రెండు మూడు సినిమాల షూటింగ్‌ల‌తో బిజీ అయిపోయారు. దాంతో ఏవైనా త్వ‌ర‌గా పూర్త‌వుతాయో వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పీరియాడిక్ డ్రామాకు బ్రేక్ ఇచ్చారు ప‌వ‌న్. అయితే ఎన్నిక‌లు అయ్యాక షూటింగ్ పూర్తి చేస్తామ‌ని ఇప్ప‌టివ‌ర‌కు క్రిష్ ఒక మాట కూడా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.