Hari Hara Veera Mallu: ఆగిపోయినట్లేనా..?
Hyderabad: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను (pawan kalyan) మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లలో ఇప్పటికే చాలా సార్లు చూసేసాం. ఇవన్నీ కాదు.. పవన్‌ని ఈ లుక్‌లో చూసారా అంటూ హరిహర వీరమల్లు (harihara veeramallu) సినిమాతో ఫ్యాన్స్‌లో కొత్త హైప్ క్రియేట్ చేసారు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (krish jagarlamudi). పోస్టర్ రిలీజ్ చేసి ఆ హైప్‌కి ఎక్కడికో తీసుకెళ్లారు. 2021లో క్రిష్ ఈ సినిమాను అనౌన్స్ చేసారు. నిధి అగర్వాల్ (nidhi agarwal) హీరోయిన్‌గా నటిస్తోందని, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (arjun rampal) విలన్‌గా చేస్తారని కూడా ప్రకటించేసారు.
పీరియాడికల్ యాక్షన్ సినిమాగా పవన్‌ను ఓ కొత్త జోనర్‌లో చూపించబోతున్నారని ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోయారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.150 కోట్లు బడ్జెట్ కూడా ఫిక్స్ చేసారు. తీరా చూస్తే ఇప్పుడు ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. ఇందుకు మొదటి కారణం పవన్ రాజకీయాలతో మరోపక్క వరుస సినిమాలతో బిజీగా ఉండటం అయితే.. మరో కారణం క్రిష్ ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ చేయడంలేదని టాక్ నడుస్తోంది. అందుకే పవన్ కూడా తన విలువైన సమయాన్ని ఈ సినిమాపై పెట్టాలనుకోవడం లేదట. దాంతో సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.