Hanuman OTT Release: ఇంకాస్త లేటుగా

Hanuman OTT Release: మిగిలిన జోనర్లతో పోలిస్తే డివోషనల్ కాన్సెప్టుతో వచ్చే చిత్రాలకు అన్ని భాషల్లోనూ భారీగానే స్పందన వస్తుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాటికి సోషియో ఫాంటసీ ఎలిమెంట్లను జోడించి తీసిన సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇలా టాలీవుడ్ నుంచి వచ్చి నేషనల్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించిన సినిమానే ‘హనుమాన్’. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ ఎప్పుడో ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ హనుమాన్ కోసం మాత్రం ఆడియన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఈ వెయిటింగ్‌ను ఇంకొన్ని రోజులు తప్పేలా లేదు.

తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్‌ను ఇచ్చారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి టఫ్ ఫైట్‌లో చిన్న సినిమా ఏం చేస్తుందిలే అనుకున్న వారందరికీ పెద్ద షాకే ఇచ్చింది హనుమాన్. ఇక ఇటీవల థియేటర్లో విజయవంతంగా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. (Hanuman OTT Release)

నిజానికి గత కొన్ని రోజులుగా హనుమాన్ సినిమా మార్చి నెలలో ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. మార్చి 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో ఈరోజు వరకూ పోస్టులు కనిపించాయి. కానీ జీ5 ఓటీటీ సంస్థ మాత్రం హనుమాన్ మూవీని ఇంకాస్త ఆలస్యం చేస్తూ తాజాగా అఫీషియల్‌ ప్రకటన చేసింది. మార్చి 8 నుంచి హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని కన్ఫార్మ్ చేసింది జీ5. ఇక ఈ ఓటీటీ హక్కులు కోసం జీ5 భారీగానే ఖర్చు పెట్టినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను జీ5 మొత్తంగా రూ. 16 కోట్లకి కొనుగోలు చేసిందట. ఇందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు కాగా హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు ఇచ్చిందట.

300 కోట్లకి పైగా హనుమాన్ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. కేవలం 40 కోట్లతో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్‌లో కూడా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో హనుమంతుడి ఎంట్రీ సీన్ చూసి ఆడియన్స్‌కి గూస్ బంప్స్ వచ్చాయి. అసలు కైమాక్స్ అయితే మరో రేంజ్‌లో ఉందంటూ బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో ప్రశాంత్ వర్మ ఉత్సాహంగా హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో హనుమాన్ పాత్రను ఓ స్టార్ హీరో పోషిస్తాడని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పాడు. అయితే అది ఎవరూ అనే దానిపై ప్రకటన చేయలేదు. కానీ చాలా మంది హనుమాన్ పాత్రను హీరో రానా చేస్తారని అనుకుంటున్నారు. మరికొంతమంది అయితే కేజీఎఫ్ హీరో యష్ ఆ పాత్రను చేస్తారేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి హనుమాన్ హిట్‌తో సీక్వెల్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.