Hansika Motwani: బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు!
Chennai: చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించినా హీరోయిన్‌గా దక్షిణాదిన రాణించిన హీరోయిన్ హన్సికా మోత్వాని(Hansika Motwani). హన్సిక కెరీర్ మొదటి నుండీ వివాదాలమయంగానే సాగుతోంది. ఇటీవల పెళ్లి విషయంలోనూ వివాదంలో చిక్కుకుంది. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్(Bollywood) గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో తాను ఎలాంటి సమస్యలు ఎదుర్కొందో చెప్పుకొచ్చింది.
ఎనిమిదేళ్ల వయసులోనే బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హన్సిక.. ‘దేశముదురు’(Desamuduru) సినిమాతో దక్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె లుక్స్, క్యూట్‌నెస్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. కాగా, ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డిజైనర్ దుస్తులు కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారని చెప్పుకొచ్చింది. కెరీర్ మొదలుపెట్టిన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “కథానాయికగా ఎంట్రీ ఇచ్చాక దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ బాలీవుడ్లో కొంతమంది డిజైనర్లు దుస్తులు ఇవ్వడానికి అంగీకరించలేదు. సౌత్ నటిననే కారణంతో వాళ్లు అలా చేశారు. ఓ సారి సినిమా రిలీజ్ ఈవెంట్ కోసం దుస్తులు డిజైన్ చేస్తారా? అని అడిగితే ‘నో’ అని ముఖంపై చెప్పేసేవాళ్లు. అలా చెప్పిన చాలామంది ఇప్పుడు డిజైన్ చేస్తానని వస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది హన్సిక. ప్రస్తుతం హన్సిక చేతిలో ‘పార్టనర్’,‘రౌడీ బేబీ’,‘గార్డియన్’, ‘గాంధారీ’, ‘మ్యాన్’తమిళ సినిమాలతోపాటు ‘105 మినిట్స్’,‘మై నేమ్ ఈజ్ శ్రుతి’తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.