Hansika: తెలుగు హీరో క్యాస్టింగ్ కౌచ్ … నేను అలా అనలేదు!
Hyderabad: ఓ తెలుగు హీరో తనను డేటింగ్‌కి రమ్మన్నాడని హన్సిక (hansika) షాకింగ్ వ్యాఖ్యలు చేసినట్లు పలు మీడియా ఛానెల్స్ పబ్లిష్ చేసాయి. దాంతో హన్సిక (hansika) దీనిపై క్లారిటీ ఇచ్చారు. “అసలు తెలుగు ఇండస్ట్రీ గురించి తాను ఎక్కడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడలేదని అన్నారు. కొన్ని మీడియా పబ్లికేషన్స్ క్రాస్ చెక్ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి నేను ఎక్కడా అనలేదు. దయచేసి ఫ్యాక్ట్ చెక్ చేసుకుని రాయండి” అని ట్వీట్ చేసారు. హన్సిక (hansika) తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్ (allu arjun), ఎన్టీఆర్ (jr ntr)..ఇలా ఎందరో టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
చాలా కాలంగా హన్సిక తెలుగులో కనిపించింది లేదు. అలాంటిది ఒక్కసారిగా తెలుగులో యాక్ట్ చేస్తున్నప్పుడు ఓ హీరో డేటింగ్‌కి రావాలని ఫోర్స్ చేసేవాడని, వార్నింగ్ ఇచ్చి దూరం పెట్టానని హన్సిక చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఎక్కడా ఈ విషయం గురించి ప్రస్తావించకుండానే కొన్ని ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ ఇలాంటి రాస్తుండడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం సమంతకు (samantha) కూడా ఇలాంటి సిచువేషన్ ఎదురైంది. శాకుంతలం (shaakuntalam) సినిమా ప్రమోషన్స్ సమయంలో మాజీ భర్త అక్కినేని నాగచైతన్య ఎవరితోనే డేటింగ్‌లో ఉన్నారని, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నట్లు రాసేసారు. దాంతో ఆమె వెంటనే నేను అలా అనలేదు అని ట్వీట్ చేసారు.