Hansal Mehta: బాలకృష్ణలా కాదు.. నా భార్యను నేను ముద్దుపెట్టుకున్నా
Hansal Mehta: బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా.. నందమూరి బాలకృష్ణను పట్టుకుని చెత్త వెధవ అని కామెంట్ చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ.. ఉన్నట్టుండి స్టేజ్‌పై ఉన్న హీరోయిన్ అంజలిని తోసేసారు. ఆ వీడియో జాతీయ స్థాయిలో వైరల్‌గా మారింది. దీనిపై బాలీవుడ్ దర్శకుడు అయిన హన్సల్ మెహతా స్పందిస్తూ.. ఎవడీ చెత్త నా కొడుకు అని కామెంట్ చేసాడు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.
హన్సల్ మెహతా తన భార్యను ముద్దుపెట్టుకున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఇలా చేస్తున్న ఈ చెత్త నా కొడుకు ఎవరు అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనిపై హన్సల్ మెహతా స్పందిస్తూ.. మీ ట్రోలింగ్ ఇక్కడ పనిచేయదు. మీ బాలకృష్ణలా కాదు. నేను నా భార్యను ముద్దుపెట్టుకున్నా కానీ ఏ అమ్మాయినీ అలా తోసేయలేదు అని రిప్లై ఇచ్చారు.