ఎవడీ చెత్త నాకొడుకు.. బాలయ్యపై దర్శకుడి షాకింగ్ కామెంట్
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణపై బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా షాకింగ్ కామెంట్స్ చేసారు. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్‌లో నటి అంజలి కూడా ఉంది. అయితే స్టేజ్‌పై బాలయ్య అంజలిని సరదాగా తోసేసారు. దాంతో పక్కనే ఉన్న నేహా శెట్టి ఆమెకు సపోర్ట్ ఇచ్చింది. లేకపోతే అంజలి స్టేజ్‌పై పడిపోయేదే.
అలా ఓ అమ్మాయిని తోసేయడంపై హన్సల్ మెహతా స్పందిస్తూ.. ఎవడీ చెత్తనా కొడుకు అని కామెంట్ చేసారు. హన్సల్ చేసిన కామెంట్‌కి ఓ తెలుగు నెటిజన్ స్పందిస్తూ.. అతను టాలీవుడ్‌లో పెద్ద హీరో అని.. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కుమారుడని చెప్పాడు. ఆ రిప్లైకి హన్సల్ మెహతా స్పందిస్తూ.. ఒక చెత్త నా కొడుకు X 100 అని బాలయ్యకు సపోర్ట్ చేస్తున్నవారు కూడా చెత్త వెధవలే అనే అర్థం వచ్చేలా మరో కామెంట్ పెట్టారు.