Gurmeet: CPR చేసి ప్రాణం పోసిన‌ “రాముడు”

భ‌గ‌వంతుడు మ‌నిషి రూపంలోనే వ‌చ్చి సాయం చేస్తాడు అంటుంటారు. ప్ర‌ముఖ హిందీ న‌టుడు గుర్మీత్ చౌదరిని (gurmeet) చూస్తే ఆ మాట నిజ‌మేనేమో అనిపిస్తుంది. ముంబై రోడ్డుపై ఓ వ్య‌క్తి కుప్ప‌కూలిపోయి ఉండ‌టంతో అత‌న్ని చూసిన గుర్మీత్ వెంట‌నే వెళ్లి సీపీఆర్ చేసి అత‌ని ప్రాణాల‌ను కాపాడాడు. ఆ త‌ర్వాత అంబులెన్స్‌ను పిలిపించి మెరుగైన చికిత్స కోసం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

మ‌న తెలుగు వారికి గుర్మీత్ అంటే పెద్ద‌గా తెలీక‌పోవ‌చ్చు కానీ 2008లో వచ్చిన రామాయ‌ణ సీరియ‌ల్‌లో రాముడి పాత్ర‌లో న‌టించి బాగా పాపుల‌ర్ అయ్యాడు. అప్ప‌ట్లో ఈ సీరియ‌ల్ ఎంత ఫేమ‌స్ అయిందంటే.. రాముడంటే ఇలాగే ఉంటాడేమో అని అప్ప‌టి త‌రానికి అనిపించేలా గుర్మీత్ ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఈ సీరియ‌ల్‌లో సీత‌గా న‌టించిన డెబీనా బెన‌ర్జీనే గుర్మీత్ నిజ జీవితంలోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. (gurmeet)