Guntur Kaaram క‌లెక్ష‌న్స్ రాజ‌మౌళి సినిమాల‌కు స‌మానంగా ఉంటాయ్!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు (mahesh babu) న‌టిస్తున్న గుంటూరు కారం (guntur kaaram) సినిమా క‌లెక్ష‌న్స్ రాజ‌మౌళి  (rajamouli) సినిమా క‌లెక్ష‌న్స్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు నిర్మాత నాగ‌వంశీ (naga vamsi). త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (trivikram srinivas) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవ‌బోతోంది. ద‌స‌రాకు సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయ‌నున్నారు. సినిమా మాత్రం ఒక రేంజ్‌లో ఉండ‌బోతోందని ఇదే మాట ఫ్యాన్స్ జ‌న‌వ‌రి 12న అంటార‌ని నాగ‌వంశీ తెలిపారు.