Guntur Kaaram: స‌లార్‌ను బీట్ చేసేసింది..!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొదటి ఆట నుంచి ఈ సినిమాకి డివైడ్ వచ్చింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మహేష్ – త్రివిక్రమ్ సినిమా అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో, ఆ రేంజ్ అంచనాలను అందుకోలేకపోవడం వల్లే ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందని అందరూ అంటూ ఉన్నారు. కోస్తాంధ్రలో తప్ప మిగిలిన అన్నీ ప్రాంతాలలో కూడా ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కి 50 శాతంకి పైగా నష్టాలు వచ్చాయి. అయితే కొంతమంది ఈ సినిమాని చూసిన వాళ్ళు, గుంటూరు కారం చిత్రం మాస్ ఆడియన్స్ ఎలా అయితే కోరుకుంటున్నారో, అలాగే ఉంది, కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా, కొంతమంది కుట్రలు చేసి నెగటివ్ టాక్ తీసుకొని రావడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు. (Guntur Kaaram)

ALSO READ: Mahesh Babu: ఆ 3 సినిమాలే నా కెరీర్‌ను మ‌లుపు తిప్పాయ్‌

అయినా ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డివైడ్ టాక్ తో అది కూడా ఓ రీజినల్ సినిమా వారం రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు కొల్లగొట్టడం ‘గుంటూరు కారం’ సినిమాకు మాత్రమే సాధ్యమైంది. మరే స్టార్ హీరో సినిమా ఈ అరుదైన ఘనతను సాధించలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి విపరీతమైన క్రేజ్ ఉండడం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

అయితే ఇటీవలే ఈ చిత్రానికి OTT లో వస్తున్న రెస్పాన్స్ ని బట్టీ చూస్తే వాళ్ళు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమాకి కేవలం మూడు రోజుల్లోనే 3.5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఇది లేటెస్ట్ టాలీవుడ్ రికార్డు అని అంటున్నారు. థియేటర్ లో ఈ సినిమాని చూడని వాళ్ళు, ఇంత మంచి సినిమాని ఎలా ఫ్లాప్ చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా సలార్, హాయ్ నాన్న రికార్డుని సైతం బద్దలు కొట్టిందట. ‘సలార్’ చిత్రానికి పది రోజులకు కలిపి 3.5 మిలియన్ వ్యూస్, నాని నటించిన హాయ్ నాన్న సినిమాకు 4.2 మిలియన్ వ్యూస్ వస్తే, ‘గుంటూరు కారం’ చిత్రానికి కేవలం మూడు రోజుల్లోనే 4.9 మిలియన్ వ్యూస్ వచ్చాయట. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, కంటెంట్ పరంగా గుంటూరు కారం ఫ్లాప్ అయ్యే రేంజ్ కాదని, కావాలని తొక్కేశారని అని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.