Sai Pallavi అంటే చాలా ఇష్టం.. మాట్లాడే ధైర్యం లేదు

Mumbai: బాలీవుడ్ న‌టుడు గుల్ష‌న్ దేవ‌య్య‌కు (gulshan devaiah) మ‌న భానుమ‌తి సాయి ప‌ల్ల‌వి (sai pallavi) తెగ నచ్చేసింద‌ట‌. ఏదో సినిమాలో చూసి ఆమెపై మ‌న‌సుపారేసుకున్నాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు.. ఆమె ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్ కూడా ఉంద‌ట కానీ ఫోన్ చేయాల‌న్నా మెసేజ్ చేయాల‌న్నా ధైర్యం చాలడంలేద‌ని అంటున్నాడు. చూడ‌బోతే అన్నీ కుదిరితే సాయి ప‌ల్లవిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న‌ట్లు గుల్ష‌న్ ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు.

“నాకు సాయి ప‌ల్ల‌వి (sai pallavi) అంటే క్ర‌ష్‌. చాలా మంది న‌టి, డ్యాన్సర్. ఎప్ప‌టినుంచో ఆమె సినిమాలు సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తున్నా. నా ద‌గ్గ‌ర త‌న నెంబ‌ర్ కూడా ఉంది కానీ త‌న‌తో మాట్లాడే ధైర్యం లేదు. ఎప్పుడైనా నాకు త‌న‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తా. ఇక పెళ్లి గురించి అంటే జ‌ర‌గాల‌ని రాసి ఉంటే జ‌రుగుతుంది లేదంటే లేదు. ఏదైనా రాసిపెట్టి ఉండాలి క‌దా” అని తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే సాయి ప‌ల్ల‌వి ఓకే అనాలే కానీ ఆమెను పెళ్లి చేసుకోడానికి గుల్ష‌న్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రి దీనికి సాయి ప‌ల్ల‌వి ఏమంటుందో చూడాలి.