Star Hero Wife: వైన్ తాగడానికి మతం మార్చుకున్నా
Star Hero Wife: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద భార్య సునీత షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. తనకు వైన్ తాగాలనిపించి క్రిస్టియన్ మతంలోకి మారానని వెల్లడించారు. సునీత చిన్నప్పటి నుంచి క్రిస్టయన్ స్కూల్‌లోనే చదివారట. ఆమె ఫ్రెండ్స్ కూడా క్రిస్టియన్సే అట. అదే సమయంలో తాను క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యానని.. వైన్ తాగచ్చు అనే ఒకే ఒక్క కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇలాంటి మాటలు మాట్లాడి మూతి పళ్లు రాలగొట్టుకుంటూ ఉంటారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ తర్వాతి సీజన్ కోసం సునీతను సంప్రదించారట. దాంతో సునీత వారిపై మండిపడ్డారు. “” నేను బిగ్ బాస్‌కి రావాలా? అక్కడ బాత్రూమ్‌లు కడగాలా? నా స్థాయేంటి? మీరు ఇలాగే షారుక్ ఖాన్ భార్యను అడుగుతారా “” అంటూ వారిపై మండిపడ్డారు.