Govinda: బాలీవుడ్ న‌టుడు గోవింద‌కు బుల్లెట్ గాయాలు

govinda suffers bullet injury

Govinda: బాలీవుడ్ న‌టుడు గోవిందకు బుల్లెట్ గాయాల‌య్యాయి. త‌న వ‌ద్ద ఉన్న లైసెన్స్ తుపాకీ మిస్‌ఫైర్ కావ‌డంతో బుల్లెట్ కాలికి త‌గిలింది. వెంట‌నే ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలిపారు. ఈరోజు తెల్ల‌వారుజామున 4:45 గంట‌ల స‌మ‌యంలో గోవింద క‌ల‌క‌త్తా వెళ్లాల్సి ఉంది. రెడీ అవుతున్న స‌మ‌యంలో త‌న పాకెట్‌లో తుపాకీ పెట్టుకుంటుండ‌గా అది కింద ప‌డి మిస్‌ఫైర్ అయ్యింది. దాంతో బుల్లెట్ కాలికి త‌గిలిందని ఆయ‌న మేనేజ‌ర్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.